దర్వాజ కోసం తవ్వుతుండగా కూలిన ఇల్లు.. తప్పిన పెను ప్రమాదం

by Sridhar Babu |   (  Updated:2021-12-16 05:00:29  IST  )

<p>దిశ, కరీంనగర్ సిటీ: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో రెండంతస్తుల పాత భవనం కూలిపోయింది. దర్వాజకు మరమ్మత్తులు చేపడుతుండగా, భవనం పగుళ్లు పట్టి కిందకు కుంగటం ప్రారంభించింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం నగరంలో సంచలనం సృష్టించింది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఇల్లు కావడంతో మరమ్మత్తులు ప్రారంభించారు. తాజాగా.. దర్వాజ తీసేందుకు యత్నిస్తుండగా ప్రమాదం జరిగినట్లు [&hellip;]</p>

House collapsed
X

దిశ, కరీంనగర్ సిటీ: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో రెండంతస్తుల పాత భవనం కూలిపోయింది. దర్వాజకు మరమ్మత్తులు చేపడుతుండగా, భవనం పగుళ్లు పట్టి కిందకు కుంగటం ప్రారంభించింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం నగరంలో సంచలనం సృష్టించింది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఇల్లు కావడంతో మరమ్మత్తులు ప్రారంభించారు. తాజాగా.. దర్వాజ తీసేందుకు యత్నిస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, డిజాస్టర్ సిబ్బంది సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. భవనం సెల్లార్‌లో ఇద్దరు వ్యక్తులుండగా, వారిని 108 సిబ్బంది సురక్షితంగా వెలికి తీశారు.

Next Story