పోలీసులపైనే కోర్టు ధిక్కారణ పిటిషన్.. ఎందుకంటే ?

by  |
piduguralla
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైంది. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణను అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ రామకృష్ణను పిడుగురాళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ, పిడుగురాళ్ల పోలీసులపై పిటిషన్ దాఖలు చేసినట్లు హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, పిడుగురాళ్ల టౌన్ సీఐ ప్రభాకర్ , ఎస్ఐలు సమీర్ బాషా, ఎం.పవన్ కుమార్, చరణ్‌లు, ఏఎస్ఐలు గౌరి , కానిస్టేబుల్స్ వెంకట రెడ్డి, రామకృష్ణలపై ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.

అలాగే రూ. 10 లక్షల నష్ట పరిహరం ఇవ్వాలని పిటిషన్ వేసినట్లు తెలిపారు. మఫ్టీలో ఉన్న పోలీసుల కిడ్నాప్ చేయడంపై పోలీసులపై మరో ప్రైవేట్ కేసు కూడా వేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీసులకు న్యాయస్థానం అంటే లెక్కలేకుండా పోయిందని న్యాయవాది నర్రా శ్రీనివాస్ విమర్శించారు. చట్టం విలువ ఏంటో గుంటూరు జిల్లా పోలీసులకు చూపిస్తామని న్యాయవాది హెచ్చరించారు.

Next Story

Most Viewed