రంజాన్ వేళ.. మసీదులో బాంబు పేలుడు, 12 మంది మృతి

113
bomb blast, Masjid

కాబుల్: రంజాన్ వేళ అప్ఘనిస్తాన్‌‌లో దారుణం చోటు చేసుకుంది. అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని మసీదులో ప్రార్థనలు ప్రారంభం కాగానే ఈ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు తామే బాధ్యుల మంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదని పోలీసులు పేర్కొన్నారు. మత గురువు టార్గెట్‌గా బాంబులను అమర్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..