- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Weather Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే..?
నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దిశ, వెబ్డెస్క్: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడుతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లైతే.. రాష్ట్రంలో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈదురుగాలులు, మెరుపుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతాల వారీగా వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అధికారులు వెల్లడించారు.
హైద్రాబాద్లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం ఉంటుంది. 29 డిగ్రీల సెల్సియస్
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.






