- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అప్డేట్.. ప్రజలకు అధికారులు కీలక హెచ్చరిక?
నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దిశ, వెబ్డెస్క్: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో చూసినట్లైతే.. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసినట్లైతే..
కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వానలు పడుతాయి. కాగా అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బయటకు వెళ్లేటప్పుడు గొడుగులు, రెయిన్కోట్లు వంటివి సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున బలహీనమైన నిర్మాణాల దగ్గర ఉండకపోవడం మంచిది.
హైద్రాబాద్లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం .. 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.






