- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్.. అక్కడ వర్షాలు, ఇక్కడ ఎండలు
గత కొద్దిరోజుల నుండి తెలుగు రాష్ట్రాలలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్దిరోజుల నుండి తెలుగు రాష్ట్రాలలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు వర్షం కురుస్తుందో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియలేని పరిస్థితి నెలకొంది. రేపు ఏపీలోని అల్లూరి జిల్లా కూనవరం, కాకినాడలోని జగ్గంపేట, ఏలేశ్వరం, కిర్లంపూడి మండల్లాలో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని ఏపీ వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా పిడుగులతో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక తెలంగాణలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, ములుగు,పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లో 50 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.






