- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యుడే.. సూర్యుడే.. సుర్రుమంటున్నాడే..! ప్రజలకు హెచ్చరిక
'శివరాత్రికి చలి శివ శివ' అంటూ పోతుందని నానూడీ.

దిశ, వెబ్ డెస్క్: 'శివరాత్రికి చలి శివ శివ' అంటూ పోతుందని నానూడీ. అంటే శివరాత్రి వరకు వాతావరణం చల్లగా ఉంటుందని అర్థం. కానీ, పరిస్థితులు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇంకా శివరాత్రి రానే లేదు. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇక ఫిబ్రవరి రెండో వారంలోనే ఎండలు ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
వేసవి ఆరంభం కంటే ముందే తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది ఒకటి, రెండు డిగ్రీల హెచ్చుదల కనిపిస్తున్నట్లుగా వివరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటికి వెళ్లకూడదని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు సరైనా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని, పండ్ల రసాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక భూతాపం కారణంగా ఇప్పటికే గడిచిన 2024 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరి 2025 ఏం చేయబోతోందీ అన్న ఆందోళనలు మొదలయ్యాయి. గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రత సగటున 0.94 డిగ్రీలు పెరిగింది. 1958లో 1.17, 1990లో 0.97 డిగ్రీలు పెరిగాయి. ఆ తర్వాత ఇదే అధికం.






