ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మందగించిన రుతుపవనాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి.

ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మందగించిన రుతుపవనాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. కానీ.. ఆకాశం మేఘావృతమై ఉన్నా.. వాతావరణం మాత్రం ఉక్కపోతగా ఉంటుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిప్రాంతాల్లో పగలంతా ఎండ, సాయంత్రానికి వర్షం కురుస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకూ మండుటెండలకు భయపడిన ప్రజలు.. అడపా, దడపా కురుస్తున్న వర్షాలతో సేద తీరుతున్నారు.

నేడు రాష్ట్రంలోని శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈదురుగాలులు వీచే సమయంలో, వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, హోర్డింగుల వద్ద నిలబడవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story