తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరికలు.. ఈ రోజు భారీ వర్షాలు

by Malleboina Mahesh |

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరికలు.. ఈ రోజు భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ (Meteorological Department issues alert) చేసింది.ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్న విషయం తెలిసిందే. నిన్న (సోమవారం) మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని సగభాగం జలమయం అయింది. ఇదిలా ఉండగా.. ఈ రోజు కూడా నగరంలో పాటు ఇతర జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసిన వాతావరణ శాఖ రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. ద్రోణి ప్రభావం పెరిగితే ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) కూడా జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

ఈ క్రమంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు (Gusty winds) వీయడంతో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం (Torrential rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగర్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (Officials of Meteorological Department) తెలిపారు.

Next Story