- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HeatWave Alert : తెలంగాణలో భానుడి భగభగలు.. ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత
ఎండాకాలం ఇంకా పూర్తిగా మొదలవనే లేదు.. అప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని(Heatwave) చూపిస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఎండాకాలం ఇంకా పూర్తిగా మొదలవనే లేదు.. అప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని(Heatwave) చూపిస్తున్నాడు. సాధారణంగా ఉగాది పండగ తర్వాత తెలుగు రాష్ట్రాలపై భానుడి తీవ్ర ఎఫెక్ట్ ఉంటుంది. కాని ఈఏడాది మాత్రం హోలీ పండగ కూడా దాటకముందే ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగానేటి నుంచి వడగాల్పులు మొదలయ్యాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బుధవారం ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలోని లింగాపూర్(Nirmal District Lingapur) లో 40.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ లోని ఫలక్ నుమాలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే నిర్మల్, అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాలో 40 డిగ్రీల కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఎండలకు అల్లాడిపోయారు. కాగా మార్చ్ 13 నుంచి 18 వరకు మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితే తప్ప పగటిపూట బయట తిరగవద్దని ప్రజలకు సూచించింది.






