- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ రిలీఫ్.. తీరం దాటిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం(storm) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వాయుగుండం మొదట నెమ్మదిగా కదిలి నప్పటికి.. నిన్న సాయంత్రం నుంచి వేగం పుంజుకుని.. మంగళవారం ఉదయం తీరం దాటింది. ఓడిశాలోని గోపాల్ పూర్ వద్ద ఈ వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ (Department of Meteorology) అధికారులు స్పష్టం చేశారు. అలాగే వాయుగుండం తీరం దాటినప్పటికి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లోదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, దీంతో సముద్ర తీర ప్రాంతంలో అలల తాకిడి విపరీతంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే వాయుగుండం తీరం దాటినప్పటికీ ఏపీలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy to very heavy rains) కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. కృష్ణ, గోదావరి తో పాటు ఇతర అన్ని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి పెట్టారు. దీంతో 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు నేరుగా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి ప్రవహిస్తుంది.






