Big Rain Alert : ఆ జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్

by Muthe.Rajitha |

తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించింది వాతావరణ కేంద్రం.

Big Rain Alert : ఆ జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించింది వాతావరణ కేంద్రం. రానున్న రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు(Thunderstroms) కురవనున్నట్టు అధికారులు తెలిపారు. సిద్దిపేట, మెదక్, జనగామ, యాదాద్రి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఆకస్మిక వానలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షం పడుతున్న సమయంలో రైతులు ఎవరూ చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు. అదే విధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని దిల్ సుఖ్ నగర్, బీరంగూడ, బిహెచ్ఈఎల్, హఫీజ్ పేటలో, మియాపూర్, కూకట్ పల్లి, కొండాపూర్ లో ఓ మోస్తరు వర్షాలు కురిసాయి.

కాగా నేడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు(Heatwave) నమోదయ్యాయి. నిర్మల్, అదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక సోమవారం రాష్ట్రపవ్యాప్తంగా వడదెబ్బకు గురై 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

Next Story