Rain Alert : తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్

by M.Rajitha |
Rain Alert : తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)కు బిగ్ రెయిన్ అలర్ట్(Rain Alert) జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. బుధవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, పిడుగులు, వడగళ్ల(Hail Stroms)తో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు అధికారులు తెలిపారు.

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో గంటకు 40 నుంచి 60 కిమీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటం వలన ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేశారు. అదే విధంగా రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు పలు జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడా ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపారు.

Next Story

Most Viewed