హైదరాబాద్ మహానగర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో భారీ వర్షం

by Malleboina Mahesh |

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు ఉదయం తీరం దాటినప్పటికీ.. మరో అల్ప పీడనం ఏర్పడడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్ మహానగర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు ఉదయం తీరం దాటినప్పటికీ.. మరో అల్ప పీడనం (Low pressure) ఏర్పడడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ఉదయం నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కూడా మరికొద్ది సేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షం (heavy rain) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు (Weather Experts) అంచనా వేశారు. ఇప్పటికే నగరం మొత్తం మేఘాలు కమ్ముకోగా.. దట్టమైన నల్లని మేఘాలు సైతం మహానగరం హైదరాబాద్ మీదకు దూసుకు వస్తున్నాయి.

దీంతో మరికొద్ది సేపట్లో సరూర్‌నగర్, సైదాబాద్, మీర్‌పేట్, రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, చార్మినార్, మలక్‌పేట్, ఎల్‌బి నగర్, బండ్లగూడ జాగీర్, సెర్లింగంపల్లి, షేక్‌పేట్, గచ్చిబౌలి, లంగర్‌హౌస్, గోల్కొండ సమీప ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో చెల్లాచెదురుగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం, రాత్రి వేళల్లో మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

Next Story