- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా భర్త పైచదువులకు స్టేట్స్‌కి వెళ్లారు.. నాకేమో నా కొలీగ్‌పై ఆ ఫీలింగ్స్ కలుగుతున్నాయ్
మేడమ్! నా భర్త పై చదువులకి స్టేట్స్‌కి వెళ్లారు. నేను ఇండియాలో జాబ్ చేస్తున్నాను. ఈ మధ్య నా కొలీగ్ నా పట్ల ఆకర్షితుడవుతున్నట్లు అర్థమవుతోంది.

మేడమ్! నా భర్త పై చదువులకి స్టేట్స్‌కి వెళ్లారు. నేను ఇండియాలో జాబ్ చేస్తున్నాను. ఈ మధ్య నా కొలీగ్ నా పట్ల ఆకర్షితుడవుతున్నట్లు అర్థమవుతోంది. నాకూ అతని పట్ల ఇష్టం కలుగుతున్నది. నా భర్త దూరాన ఉండటమే కారణమా? నా భర్త దూరాన ఉంటారు కాబట్టి నేను ఇంటి పని, బయటి పని, జాబ్ చేసుకుంటూ నిత్యం టెన్షన్‌లో ఉంటా. పైగా నేనుంటున్న సొసైటీలో సాంప్రదాయాలకు విలువనిచ్చే మనుషులు ఎక్కువ. వాళ్లు నా గురించి అలాగే అనుకుంటారు. నన్నేం చేయమంటారు. ఒత్తడి ఎక్కువగా ఉంది.
మానవ లైంగికత అనేది ఒక భౌతిక పరమైన అంశం మాత్రమే కాదు. ఆలోచనా స్థాయిలో అది పూర్తి భావోద్వేగాలకు సంబంధించిన ప్రతిస్పందన. లైంగికత అనేది మానవ వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే. సెక్స్‌ను మనం ఏ దృక్పథంలో చూస్తామో అన్న దాని మీదే మన లైంగిక ప్రవర్తన నిర్ణయాలు ఉన్నాయి. నువ్వు ఉన్న పితృస్వామ్య సమాజంలో భర్తతో కాకుండా పరాయి పురుషులపై మోహం, వాంఛ, సంబంధాలు నిషిద్ధం. నీకేమో అతని మీద ఆకర్షణ. రెండింటి మధ్య ఘర్షణ జరిగి ఒత్తిడికి లోనవుతున్నావు. వివాహేతర సంబంధాలు ఎప్పుడూ తీవ్రమైన సామాజిక, కుటుంబ సమస్యలను సృష్టిస్తాయి. దంపతుల మధ్య పరస్పరం నమ్మకం, గౌరవం, విలువలు కలిగి ఉండటం ముఖ్యం. నువ్వు ఆకర్షితం అవుతున్న వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి అయితే నీ ఎంపిక తప్పవుతుంది. ప్రమాదకరం కాకపోయినా సమస్యే అవుతుంది. నువ్వు చేయాదల్సిందల్లా నీ భర్త దగ్గరికి వీలైనంత త్వరగా వెళ్ళిపోవడం. వైవాహిక జీవితంలోకి ప్రవేశించడం. నీ భర్త నీ మీద ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నువ్వు కేవలం ఆకర్షణ మాత్రమే ప్రధానంగా ఉన్న, ప్రేమ లేని సంబంధంలోకి ప్రవేశించకుండా నిర్ణయం తీసుకో.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్






