నాకు 15 ఏళ్లు, ఆయనకు 27 సంవత్సరాలు.. ఇద్దరికి ఎలా కుదురుతుంది మేడమ్

by Bhoopathi Nagaiah |

మేడమ్! నా వయస్సు 15 సంవత్సరాలు. పదో తరగతి చదువుతున్నాను. ఇంకా పై చదువులు చదవాలని ఆశ.

నాకు 15 ఏళ్లు, ఆయనకు 27 సంవత్సరాలు.. ఇద్దరికి ఎలా కుదురుతుంది మేడమ్
X

మేడమ్! నా వయస్సు 15 సంవత్సరాలు. పదో తరగతి చదువుతున్నాను. ఇంకా పై చదువులు చదవాలని ఆశ. కానీ, మా ఇంట్లొ వాళ్ళు నా కన్నా 12 సంవత్సరాల పెద్దవాడైన మా బావతో పెళ్లి చేస్తామంటున్నారు. నాకు ఇష్టం లేదు. నేనేం చేయాలి? నా ఇష్టాన్ని, ఎవరూ పట్టించుకోవడం లేడు. ఇంట్లోంచి పారిపోవాలని వుంది. కానీ, అమ్మ గురించి ఆలొచిస్తున్నాను. నాకు సలహా ఇవ్వగలరు?

15 సంవత్సరాల వయసులో మానసికంగా, శారీరకంగా ఎదగని వయస్సులో పెళ్ళి చేయటం చాలా తప్పు. బాల్య వివాహం చట్టరీత్యా నేరం. నువ్వు ఆందోళన పడకుండా బాలల హక్కుల సంఘాన్ని కలవవచ్చు. దీనికంటే ముందు మీ స్కూలు టీచర్లతో మీ తల్లిదండ్రులకు చెప్పించే ప్రయత్నం చెయ్యి. ఒప్పుకోకపోతే బాలల హక్కుల సంఘం వారిని నువ్వు సంప్రదించవచ్చు. వారు మీ ఇంటికొచ్చి మీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్ళి ఆపిస్తారు. బాల్య వివాహం విద్యాపరమైన హక్కులను కాలరాయటమే కాకుండా బలవంతపు లైంగిక జీవితం, దానిలోని హింస, టీనేజీ గర్భధారణ, అబార్షన్లు, చిన్న వయసులో తల్లి కావడం, బాల కార్మికులుగా మారడం లాంటి పరిణామాలకు దారితీస్తాయి. నీకు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించే హక్కు ఉంది. కాబట్టి, నువ్వు ధైర్యంగా నేను చెప్పిన పద్ధతిలో వెళ్ళు. అయినా, వినకుండా, బలవంతపు బాల్య వివాహం చేసే ప్రయత్నం చేస్తే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. మహిళా సంఘాలను కూడా సంప్రదించవచ్చు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story