మేడమ్.. నేను అతడిని మగాడిగా మార్చుకుంటా.. ఏం చేయాలో చెప్పండి

by Bhoopathi Nagaiah |

నేను డిగ్రీ పూర్తి చేశాను. మా ఇంటి దగ్గరి ఓ అబ్బాయిని ప్రేమించాను. ఆ విషయం అతనితో చెబితే ఇష్టం లేదన్నాడు.

మేడమ్.. నేను అతడిని మగాడిగా మార్చుకుంటా.. ఏం చేయాలో చెప్పండి
X

మేడమ్! నేను డిగ్రీ పూర్తి చేశాను. మా ఇంటి దగ్గరి ఓ అబ్బాయిని ప్రేమించాను. ఆ విషయం అతనితో చెబితే ఇష్టం లేదన్నాడు. చచ్చిపోతానని బెదిరించాను. దాంతో అతను తను ఆడపిల్ల స్వభావం కలిగి ఉన్నానని, తనకు మగాళ్లను చూస్తేనే ఆకర్షణ కలుగుతుందని చెప్పాడు. తనొక ‘హోమో సెక్సువల్’ అని చెప్పాడు. అతను నిజంగానే ‘స్వలింగ సంపర్కుడని’ తెలిసింది. ఎలాగైనా, అతనిని ఒప్పించి చికిత్స చేయిస్తాను. తనను ఆరోగ్యవంతమైన పురుషుడిగా చేయాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వండి.

తను చాలా స్పష్టంగా తన మానసిక స్థితి, లైంగిక దృక్పథం చెప్పాడు. నీకు అతనిపై ఉన్న ప్రేమ వల్ల అతన్ని మార్చాలనుకుంటున్నావు. నీకు అతన్ని మార్చాలని కాదు, అతనికి తను మారాలని, అమ్మాయిని పెళ్ళి చేసుకుని మంచి దాంపత్య జీవితం గడపాలని, పిల్లల్ని కనాలనే కోరిక, వాంఛ చాలా బలంగా ఉండి మనోలైంగిక చికిత్సకు ముందుకు వస్తేనే ఏ చికిత్స అయినా పని చేస్తుంది. ముందు అతను హెచ్ఐవి లేకుండా ఉన్నాడా లేదా తెలుసుకోవాలి. హోమో సెక్సువల్ ఓరియంటేషన్ని మార్చుకోవాలని బలంగా అనుకుంటనే సైకోథెరపీ అయినా, సెక్స్ థెరపీ అయినా పనిచేస్తాయి. అతని మీద ప్రేమతో గుడ్డి నిర్ణయాలు తీసుకోకు. తొందరపడి నిర్ణయాలు తీసుకొని జీవితం పాడు చేసుకోకు.తీవ్రమైన భావోద్వేగాలు కలిగిస్తాయి. ఒకవేళ అతనికి హెచ్ఐవి లాంటిది లేక పోయినా అతని లైంగిక ప్రవర్తనా ధోరణితో నీకు వివాహానంతర దాంపత్య శృంగార సమస్యలు వస్తాయి. తెలిసి జీవితం పాడు చేసుకోవద్దు. ఇద్దరు ప్రేమించుకుని, అతను మారాలనుకుంటే చికిత్స పనిచేస్తుంది. బలవంతంగా అతను ఉండాలనుకుంటున్నా, ఇష్టపడుతున్నా సెక్సువల్ ఓరియంటేషన్‌ని నీ కోసం మార్చాలనుకుంటే అతను మారడు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story