- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఓకేను ఆక్రమించకుండా కాల్పుల విరమణకు ఎందుకొచ్చారు: సీపీఐ నారాయణ
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తలకు ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం తో బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తలకు ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధ వాతావరణంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదియగా.. కాల్పుల విరమణ (ceasefire)కు ఇరు దేశాలు అంగీకరించాయి. ఇదిలా ఉంటే పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి చేసి 100 మందిని హతమార్చగా.. సీపీఐ నారాయణ (CPI Narayana) దీనిని వ్యతిరేకించారు. తాజాగా.. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఆయన స్వాగతిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. భారత్ యుద్ధాన్ని (Indian War) ఆపడం పై పలు విమర్శలు చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు జరగాలి అన్నందుకు ఒకప్పుడు నన్ను పాకిస్తాన్ పంపాలని అవాక్కులు చవాకులు పేలారు, మరి ఇప్పుడు ప్రధాని మోడీని పాకిస్తాన్ పంపించాలా అని ప్రశ్నించారు. భారత్ పీఓకేను ఆక్రమించకుండా ఎందుకు కాల్పుల విరమణకు వెళ్లిందని ఈ సందర్భంగా సీపీఐ నారాయణ భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.






