మాకే సంబంధం లేదు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్

by Muthe.Rajitha |

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న సైనిక ఘర్ణణలతో అమెరికాకు ఏ సంబంధం లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తేల్చి చెప్పారు.

మాకే సంబంధం లేదు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న సైనిక ఘర్ణణలతో అమెరికాకు ఏ సంబంధం లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తేల్చి చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అనేశారు. భారతదేశం-పాకిస్తాన్ వివాదం ‘ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు. భారత్, పాక్‌లు అమెరికా నియంత్రణలో లేవు అనేశారు.

ఒహియో మాజీ సెనేటర్ అయిన జేడీ వాన్స్ శుక్రవారం ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, ఈ వివాదం ‘సాధ్యమైనంత త్వరగా తగ్గాలని’ అమెరికా కోరుకుంటుందని అన్నారు. అయితే, ఈ దేశాలను మేము నియంత్రించలేము. ప్రాథమికంగా, భారతదేశానికి పాకిస్తాన్‌తో విభేదాలు ఉన్నాయి. పాకిస్తాన్ తనపై భారతదేశ దాడులకు ప్రతిస్పందించింది. మనం చేయగలిగేది ఏమిటంటే, ఈ ఘర్షణను కొంచెం తగ్గించమని కోరడం, కానీ ప్రాథమికంగా మాకు సంబంధం లేని, అమెరికా నియంత్రణ సామర్థ్యంతో సంబంధం లేని యుద్ధంలో మనం పాల్గొనబోము” అని వాన్స్ జోడించారు.

ట్రంప్, వాన్స్ ఒకేమాట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను 'భయంకరమైనది' అని పిలిచిన ఒక రోజు తర్వాత జెడి వాన్స్ పెద్ద ప్రకటన చేయడం గమనార్హం. ఈ రెండు దేశాలకు సంబంధించి తన స్థానం గురించి మీడియా ట్రంప్‌ని అడిగినప్పుడు, నేను రెండింటితోనూ కలిసిపోతాను అని సమాధానమిచ్చారు.

“నాకు రెండు దేశాలూ బాగా తెలుసు. వారు దానిని పరిష్కరించుకోవాలని నేను కోరుకుంటున్నాను, నేను వాటిని ఆపాలనుకుంటున్నాను. వారు తమ ఘర్షణలను ఆపగలరని ఆశిస్తున్నాను, రెండు దేశాలూ పూర్తిగా విరుద్ధ అభిప్రాయాలతో ఉన్నారు, కానీ వారు యుద్ధాన్ని ఆపగలరని ఆశిస్తున్నాను” అని ట్రంప్ విలేకరులతో అన్నారు. మేము రెండు దేశాలతో బాగా కలిసి ఉన్నాము, రెండింటితో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను దానిని ఆపాలని కోరుకుంటున్నాను. పైగా నేను సహాయం చేయడానికి ఏదైనా చేయగలిగితే, నేను తప్పక అక్కడే ఉంటాను అని ట్రంప్ పేర్కొన్నారు.

భారతదేశం మంగళవారం రాత్రి పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ దాడులను ప్రారంభించింది, 26 మందిని బలిగొన్న పహల్గామ్‌లో జరిగిన దాడికి ప్రతిస్పందనగా తొమ్మిది ఉగ్రవాద దాడులను చేసింది. దీనికి ప్రతీకారంగా జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ మరికొన్ని ప్రాంతాలలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారతదేశం గురువారం రాత్రి క్షిపణులతో, డ్రోన్లతో తిప్పికొట్టింది.

Next Story