- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ManKi Bath : నక్సలిజాన్ని అంతం చేశాం : మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) తొలి మన్‌కీ బాత్(ManKi Bath)(122వ ఎపిసోడ్)లో మాట్లాడారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) తొలి మన్‌కీ బాత్(ManKi Bath)(122వ ఎపిసోడ్)లో మాట్లాడారు. దేశంలో నక్సలిజం(Naxalism) నిర్మూలనలో విజయం సాధించామని పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్-అబుజ్‌మఢ్ ప్రాంతంలో జరిపిన ఆపరేషన్ భద్రతా దళాల అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. 2026 నాటికి నక్సల్-ముక్త భారతదేశం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే, నక్సల్-ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి, పునరావాస కార్యక్రమాల ద్వారా సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. ఇక ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ను ప్రస్తావిస్తూ.. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సైన్యాన్ని చూస్తే గర్వంగా ఉందన్నారు. సైన్యానికి దేశం మొత్తం అభివందనం చేస్తోందని తెలిపారు. సైన్యం సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ఓ ఉదాహరణ అని కొనియాడారు. ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకతాటిపై నిలిచిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.






