- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నాడు కానిస్టేబుల్స్.. నేడు లెఫ్టినెంట్ ఆఫీసర్స్.!

వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.
కలిసి చదువుకున్నారు.
కలిసి ఉద్యోగంలో చేరారు.
కానీ అక్కడే ఆగిపోలేదు.
ఆర్మీలోకి వెళ్లాలనే కలగన్నారు.
కట్‌చేస్తే.. వాళ్లిద్దరూ ఇప్పుడు భారత సైన్యంలో లెఫ్టినెంట్ ఆఫీసర్లు.
- దిశ, ఫీచర్స్
పంజాబ్ ఆర్మ్‌డ్ పోలీస్‌లో కానిస్టేబుల్స్‌గా కెరీర్ ప్రారంభించిన లవ్‌ప్రీత్ సింగ్.. అన్మోల్ శర్మ మంచి స్నేహితులు. సుదీర్ఘకాలం ఒకే పోలీస్ స్టేషన్‌లో పెట్రోలింగ్.. నేరస్తులను పట్టుకోవడం వంటి పనులు చేశారు. ఇది వారి రోజువారి జీవితంలో భాగం. ఉన్నతమైన లక్ష్యం కోసం కలగన్నారు. భారత సైన్యాధికారిగా యూనిఫామ్ ధరించి.. దేశ ధైర్యవంతమైన యోధుల సమక్షంలో నిలబడాలనే కల అది.
గుడినే బడిగా
కలను సాకారం చేసుకోవడానికి లవ్‌ప్రీత్ సింగ్.. అన్మోల్ శర్మ ఇద్దరూ కపూర్తలలోని "ఇండియన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సెంటర్" (ఐఎస్‌టీసీ)లో 1.5 సంవత్సరాల కఠిన శిక్షణలో చేరారు. ఇక్కడ పోలీస్ శిక్షణతో పాటు చదువును సమన్వయం చేయాల్సి వచ్చింది. ఎప్పుడో సూర్యోదయానికి ముందు నిద్రలేసి శిక్షణలో మునిగే వారి దినచర్య అర్ధరాత్రికి కూడా ముగిసేది కాదు. శారీరక శిక్షణ.. కఠిన డ్రిల్స్.. మానసిక దృఢత్వం కోసం శ్రమించేవారు. తోటివాళ్లు విశ్రాంతి తీసుకుంటుంగా.. లవ్‌ప్రీత్.. అన్మోల్ మాత్రం రాత్రిళ్లు గుడికి వెళ్లేవారు. గుడి దీపాల కాంతుల్లో పుస్తకాలు చేతబట్టుకొని చదివేవాళ్లు.
హేళనలు.. అవమానాలు
కానిస్టేబుల్ నుంచి ఆర్మీ ఆఫీసర్‌గా ఎదగానే వారి ఆకాంక్షను కొందరు హేళన చేశారు. అవమానాలకు గురిచేశారు. ప్రతికూల పరిస్థితుల వల్ల మొదట్లో వీళ్లకూ కొన్ని వైఫల్యాలు ఎదురయ్యాయి. కానీ వాళ్లెక్కడా నిరూత్సాహపడలేదు. ప్రతీ ఫెయిల్యూర్‌ని ఒక లెసన్‌గా మార్చుకున్నారు. దేశానికి సేవచేయాలనే ఉన్నత లక్ష్యమే వారిని ముందుకు నడిపించింది. ఆ లక్ష్యం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. విశ్రాంతి అనేదే లేకుండా కష్టపడ్డారు. ఇన్ని త్యాగాల ఫలితం.. ఎంపిక ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. చెన్నయ్‌లోని ప్రతిష్టాత్మక ఓటీఏలో స్థానం సంపాదించారు. అక్కడి కఠిన శిక్ష.. వారి శక్తి సామర్థ్యాలు దేశంలోని అత్యుత్తమ క్యాడెట్ల మధ్య స్థానం సంపాదించేలా ప్రోత్సహించాయి.
లెఫ్టినెంట్ ఆఫీసర్
2025 మార్చి 8. చెన్నయ్‌లోని "ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) పరేడ్ గ్రౌండ్లో ఆర్మీ యూనిఫామ్‌తో కవాతు చేస్తున్నప్పుడు వారి హృదయాలు భావేద్వేగాలతో నిండిపోయాయి. రెండు నక్షత్రాలు వారి భుజాలపై మెరుస్తుంటే ఆ మెరుపు బింబం మొఖంపై విజయ సంకేతం చూపించింది. ఇదే వారి అన్ని అడ్డంకులను అధిగమించిన విజయానికి చిహ్నం. చిరకాల స్నేహితులైన లవ్‌ప్రీత్ సింగ్.. అన్మోల్ శర్మ భారత సైన్యాధికారులుగా "లెఫ్టినెంట్ ఆఫీసర్" హోదాలో మొదటి అడుగు వేశారు. పట్టుదల కలలను సాకారం చేస్తుందనడానికి వీరిద్దరి విజయమే సరైన ఉదాహరణ. కష్టాలు.. వైఫల్యాలు లక్ష్య సాధనకు అడ్డుకావని చెప్పే సందేశం.
వీరిలా చేరండి
లవ్‌ప్రీత్.. అన్మోల్ విజయగాథ ఆర్మీలో చేరాలనుకునేవారికి.. ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలని కలగనే యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మన పరిస్థితులను బట్టి విజయాలు రావు. మనం కనే కలనుబట్టి వస్తాయని చెప్పే సక్సెస్ స్టోరీ వీళ్లది. కుటుంబ నేపథ్యం.. సామాజిక అంచనాలు ఒకరి భవిష్యత్‌ను నిర్ణయించవు.. సంకల్పం స్థిరత్వమే నిర్ణయిస్తాయని వాళ్లు నిరూపించారు. వైఫల్యం ఒక మెట్టు మాత్రమే. పట్టులే విజయానికి కీలకం అని అంటున్నారు లెఫ్టినెంట్ హోదాలో భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్న లవ్‌ప్రీత్ సింగ్.. అన్మోల్ శర్మ. వీరిని చూసయినా భారత సైన్యంలో చేరాలనుకునేవాళ్లు ముందుకు సాగండి. సిందూర్ లాంటి ఆపరేషన్లో భాగస్వాములవండి.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation