- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajasthan: రాజస్థాన్ లోని మూడు ప్రాంతాల్లో అత్యవసర రెడ్ అలెర్ట్
భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ వరుస దాడులకు పాల్పడుతోంది. అంతేకాకుండా గురువారం రాత్రి నుంచి సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ వరుస దాడులకు పాల్పడుతోంది. అంతేకాకుండా గురువారం రాత్రి నుంచి సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడుతోంది. భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ రాజస్థాన్ లోని మూడు నగరాలకు అధికారులు అత్యవసర రెడ్ అలెర్డ్ జారీ చేశారు. బార్మర్, శ్రీగంగానగర్, జోధ్ పూర్ సిటీలలో ఎమర్జెన్సీ పరిస్థితిని విధించారు. వెంటనే ప్రజలు ఎవరింటికి వారు తిరిగి వెళ్లాలని కోరారు. బార్మర్‌లోని అన్ని మార్కెట్లను మూసివేయాలని, ప్రజలు ఇళ్లకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ టీనా దాబీ పేర్కొన్నారు. “ప్రజలు వెంటనే వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆదేశిస్తున్నాం. మార్కెట్లు మూసివేయాలి. ప్రజా కదలికలను తక్షణమే నిలిపివేయాలి” జిల్లా కలెక్టర్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పూర్తి లాక్ డౌన్
శ్రీ గంగానగర్‌లో పూర్తి లాక్డౌన్ అమలులో ఉందని అధికారులు తెలిపారు. పౌరులు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం, పోలీసుల అధికారిక సూచనలను పూర్తిగా పాటించాలని నివాసితులను కోరారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా జోధ్‌పూర్‌లోనూ కర్ఫ్యూ నెలకొంది. ప్రతి ఒక్కరూ వెంటనే వారి ఇళ్లకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. మార్కెట్లు మూసివేయాలని పేర్కొన్నారు.






