- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Turkey-Pak : పాక్-తుర్కియే దోస్తీ గొప్పది : తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్
భారత్-పాక్(Bharat-Pak Conflicts) మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సమయంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్(Turkish President Erdogan) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : భారత్-పాక్(Bharat-Pak Conflicts) మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సమయంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్(Turkish President Erdogan) కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor).. తదనంతర పరిణామాల అనంతరం ఎర్డోగాన్ తొలిసారి నోరు విప్పారు. పాకిస్తాన్ తో తమ స్నేహ బంధం గొప్పదని కొనియాడారు. నిజమైన స్నేహానికి పాక్ నిదర్శనం అన్నారు. భవిష్యత్తులో కూడా తమ స్నేహం కొనసాగుతుందని, తమ స్నేహితుడికి ఎలాంటి అవసరం వచ్చినా తాము ముందుంటామని పేర్కొన్నారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pakistan PM Shehabaz Sharif) ను తమకు ఎంతో విలువైన మిత్రుడిగా ఆయన అభివర్ణించారు. కాగా భారత్-పాక్ యుద్ధం(India Pkaistan War)లో తుర్కియే పాక్ వైపు నిలిచింది. అంతేకాకుండా ఆయుధాల సహాయం, సైన్యం సహాయం కూడా చేసింది. దీంతో భారత్ లో "బాయ్ కాట్ తుర్కియే"(Boy Cott Turkey నినాదం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు భారత్ కు పుండు మీద కారం చల్లినట్టు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.






