మోడీజీ పాకిస్తాన్‌ని లేపేయండి - మల్లారెడ్డి

by velandi.Saikiran |

పాకిస్తాన్ పై (Pakisthan ) మాజీ మంత్రి, గులాబీ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. ఇండియాత

మోడీజీ పాకిస్తాన్‌ని లేపేయండి - మల్లారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ పై (Pakisthan ) మాజీ మంత్రి, గులాబీ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. ఇండియాతో ( India) పెట్టుకున్న పాకిస్తాన్ ను ప్రపంచ మ్యాప్ నుంచి లేపాయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ (మల్లారెడ్డి హెల్త్ సిటీ)లో ఆపరేషన్ సిందూర్ లో దేశ సైనికులకు సంఘీభావంగా కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు ( Harish rao), వివేకానంద, మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడారు. పాకిస్తాన్‌తో ఇప్ప‌టికీ బాధ‌లు పడుతూనే ఉన్నాం... ఉగ్ర‌వాదుల‌ను వాళ్లు పోషిస్తున్నారన్నారు. మోడీజీ ( Modiji) పాకిస్తాన్‌ని లేపేయండి.. ముక్క‌లు, ముక్క‌లు చేసి పాకిస్తాన్‌ని మ్యాప్‌లో లేకుండా చేయండి అంటూ కోరారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయండని డిమాండ్ చేశారు. ఇలాంటి ఉద్రిక్తతల టైంలో.. దేశం కోసం ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. సరిహద్దులో పోరాటం చేయకపోవచ్చు.. కానీ సైనికుల కోసం రక్తదానానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు మల్లారెడ్డి.

Next Story