Operation Sindoor : తుర్కియేకు మరో షాక్.. ఒప్పందం రద్దు చేసుకున్న JNU

by Muthe.Rajitha |

భారత్-పాకిస్తాన్(India Pakistan Conflicts) మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు.. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(JNU) తుర్కియే(Turkey)లోని ఇనోను విశ్వవిద్యాలయం(Inonu University)తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

Operation Sindoor : తుర్కియేకు మరో షాక్.. ఒప్పందం రద్దు చేసుకున్న JNU
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-పాకిస్తాన్(India Pakistan Conflicts) మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు.. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(JNU) తుర్కియే(Turkey)లోని ఇనోను విశ్వవిద్యాలయం(Inonu University)తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తుర్కియే పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం, ఆయుధాలు, సైన్య సహాయం అందించడం వంటి చర్యలతో భారత్ లో 'బాయ్ కాట్ తుర్కియే'(Boycott Turkey) నినాదం ఊపందుకుంది.

తుర్కియే భారత్‌పై వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో జాతీయా భద్రతా కారణాల వల్ల తాము MoU ను రద్దు చేసుకుంటున్నట్టు జేఎన్యూ వర్గాలు వెల్లడించాయి. గత ఫిబ్రవరిలో ఫ్యాకల్టీ, విద్యార్థి మార్పిడి, సాంస్కృతిక పరిశోధనల రెండు దేశాల యూనివర్సిటీలు ఈ ఒప్పందం చేసుకోగా 2028 వరకు కొనసాగించాల్సి ఉంది.

Next Story