Donald Trump : భారత్-పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చాను : ట్రంప్

by Muthe.Rajitha |

భారత్ - పాక్(Bharat - Pak) దేశాల మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్తలు నెలకొని, ఇరు దేశాలు యుద్ధానికి(India Pakistan War) దిగిన విషయం తెలిసిందే.

Donald Trump : భారత్-పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చాను : ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ - పాక్(Bharat - Pak) దేశాల మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్తలు నెలకొని, ఇరు దేశాలు యుద్ధానికి(India Pakistan War) దిగిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump ) మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు మే 10న కాల్పుల విరమణ(Ceasefire) ప్రకటించాయి. ఈ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. యుద్ధం వద్దని తాను ఇరు దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెప్పుకొచ్చారు. యుద్ధం కొనసాగితే ఇరు దేశాలు అణుయుద్ధాలకు(Atomic War) కూడా వెనుకాడరని.. అణుయుద్ధం జరిగే ప్రపంచ వినాశనం జరుగుతుందని పేర్కొన్నారు.

అది రెండు దేశాల మధ్యనే కాకుండా మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపించి, లక్షలాది మంది ప్రాణాలు పోడానికి కారణం అయ్యేదని తెలిపారు. కాల్పుల విరమణకు తానే రెండు దేశాలపై ఒత్తిడి తీసుకు వచ్చానని, ఈ ఘర్షణలు ఆపకపోతే ఇరు దేశాలతో తాము వాణిజ్య సంబంధాలు తెంచుకుంటామని తేల్చి చెప్పినట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరువురి మధ్య తాను పెద్దన్నలా వ్యవహరించి చెప్పడం వల్లే ఇరు దేశాలు సీజ్ ఫైర్ అమలు చేశాయని అన్నారు. ఇకపై రెండు దేశాలతో వాణిజ్యాన్ని పెంచుతామని పేర్కొన్నారు.

Next Story