- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ముగిసిన క్లూస్ టీం విచారణ
చార్మినార్ దగ్గరలోని ఓ భవనంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. మహిళలతో సహా చిన్నపిల్లలు సైతం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్: చార్మినార్ దగ్గరలోని ఓ భవనంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. మహిళలతో సహా చిన్నపిల్లలు సైతం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ ప్రధాని సైతం ఈ ప్రమాదంపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. కాగా ఈ ఘటనపై క్లూస్ టీం విచారణ పూర్తయ్యింది. భవనాన్ని లోపలికి వెళ్లి క్లూస్ టీం పరిశీలించింది. ఆ భవనం శితిలావస్థలో ఉన్నట్టు గుర్తించింది. గోడలు బీటలు వారాయని, కూలిపోయే అవాకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా భవనంలో 14 ఏసీలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. మరోవైపు రాష్ట్ర మానవహక్కుల సంఘం ఘటనపై జూన్ 30లోగా విచారణ పూర్తి చేసి నివేధిక ఇవ్వాలని సీఎస్ తో పాటూ హైదరాబాద్ సీపీని ఆదేశించింది.






