ఆపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మీకి బుడ్డోడి విరాళం.. పది నెలలుగా చేస్తున్నా.. దేశభక్తితో నిండిన ఆ మాటలకు ఫిదా కావాల్సిందే..(వీడియో)

by Sujitha Rachapalli |

ఇండియా-పాక్ యుద్ధం జరిగింది.. ఆపరేషన్ సిందూర్ టైంలో ఆర్మీ ధైర్యసాహసాలు, త్యాగాల గురించి సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్ల స్పందన కరువైంది. రియాక్ట్ అయిన స్టార్స్ సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇక ఆర్మీకి ఫండ్ అందించినవారు తక్కువే.

ఆపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మీకి బుడ్డోడి విరాళం.. పది నెలలుగా చేస్తున్నా.. దేశభక్తితో నిండిన ఆ మాటలకు ఫిదా కావాల్సిందే..(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : ఇండియా-పాక్ యుద్ధం జరిగింది.. ఆపరేషన్ సిందూర్ టైంలో ఆర్మీ ధైర్యసాహసాలు, త్యాగాల గురించి సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్ల స్పందన కరువైంది. రియాక్ట్ అయిన స్టార్స్ సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇక ఆర్మీకి ఫండ్ అందించినవారు తక్కువే. కాగా ఇలాంటి పనికిరాని సెలబ్రిటీలకు బుద్ధి చెప్పేలా ఓ బుడ్డోడు ముందుకొచ్చాడు. పదినెలలుగా పిగ్గీ బ్యాంక్‌లో సేవ్ చేసుకుంటున్న డబ్బులను ఇండియన్ ఆర్మీకి అందించాడు. తనకు దేశం పట్ల ఉన్న భక్తితో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

తమిళనాడు కరూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల షా ధన్వేష్.. పది నెలలుగా దాచుకుంటున్న డబ్బును కలెక్టర్‌కు అందించాడు. భారత సైన్యం పట్ల తనకున్న గౌరవాన్ని వివరించాడు. యుద్ధ సమయంలో మనమందించే సాయం గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. బుడ్డోడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ఇండియన్ ఆర్మీకి బాలుడి హార్ట్‌ఫుల్ సెల్యూట్’, ‘భారత దేశ భవిష్యత్ సురక్షితమైన చేతుల్లో ఉందనిపిస్తుంది’, ‘తల్లిదండ్రలు చిన్నప్పటి నుంచే ఇలాంటివి నేర్పించాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story