- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: భారత్‌లోని 27 విమానాశ్రయాలు మూసివేత
ఇండియా పాకిస్థాన్ మధ్య ఉధ్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య ఉధ్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మిస్సైల్ దాడులు, డ్రోన్ దాడులతో పాక్ పై ఇండియా విరుచుకుపడుతోంది. దీంతో పాక్ కూడా ఇండియాపై దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రెండు రోజుల పాటూ దేశంలోని 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
శనివారం 5 గంటల 29 నిమిషాల వరకు ఈ ఎయిర్‌పోర్టులను మూసివేయనున్నారు. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ మరియు ఇతర సంస్థలకు సంబంధించిన మొత్తం 430 విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. మూసివేయనున్న విమానాశ్రయాల్లో ధర్మశాల, సిమ్లా, గ్వాలియర్, శ్రీనగర్, పాటియాలా, అమృత్‌సర్, చండీగఢ్, జమ్మూ, లేహ్, లుథీయానా, బతిండా, హల్వారా, గగ్గల్, ధర్హరమ్సాల, కిషన్ గర్, జైసల్మీర్, జోధ్ పూర్, బికనీర్, ముంద్ర, జామ్ నగర్, రాక్ కోట్, పోరుబందర్, కాండ్ల, కేషోడ్, భుజ్, గ్వాలియర్, హిండన్ ఉన్నాయి.






