ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలో ‘మైదాన్’ సినిమా స్ట్రీమింగ్.. కానీ ట్విస్ట్ ఏంటంటే?

by Hamsa |
ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలో ‘మైదాన్’ సినిమా స్ట్రీమింగ్.. కానీ ట్విస్ట్ ఏంటంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్, అమిత్ శర్మ కాంబోలో వచ్చిన సినిమా ‘మైదాన్’. ఇందులో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే ఈ సినిమా ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ బయోపిక్‌గా తెరకెక్కించగా.. ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ కలెక్షన్స్ బాగానే రాబట్టింది. అయితే మైదాన్ డిజిటల్ స్ట్రీమింగ్‌‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఎలాంటి ప్రకటన లేకుండా మైదాన్ మే 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మైదాన్ మూవీ జూన్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్కైబర్లకు ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది.

Next Story