ఓటీటీలో ‘ఫ్యామిలీ స్టార్’ హవా.. ఇండియా మొత్తంలో రెండు స్థానాల్లో దూసుకుపోతుందిగా!

by Disha Web Desk 6 |
ఓటీటీలో ‘ఫ్యామిలీ స్టార్’ హవా.. ఇండియా మొత్తంలో రెండు  స్థానాల్లో దూసుకుపోతుందిగా!
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ పరశురామ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో ఇటీవల వచ్చిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే కొన్ని డైలాగ్స్ ఉండటం వల్ల సినిమా ఫ్లాప్ అయిందని నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా రిలీజ్ అయిన సమయంలో పెద్ద చర్చ జరిగింది. దీనిపై విజయ్ కంప్లైంట్ ఇచ్చాడంటూ వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అందులో నిజం లేదని పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ వివాదం అక్కడితో ఆగిపోయింది. సడెన్‌గా ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

కేవలం విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఫ్యామిలీ స్టార్ ఊహించని రెస్పాన్స్ అందుకుని ఓటీటీలో దూసుకెళ్తున్న ట్లు సమాచారం. ఇండియా మొత్తంలోనే ఈ సినిమా టాప్ 1,2 స్థానాలు దక్కించుకుంది. అంతేకాకుండా ఈ మూవీ రావడం వల్ల సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్నామని నెటిజన్లు పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుని టాప్ ట్రెండింగ్‌లో ఫ్యామిలీ స్టార్ దూసుకుపోతుంది. ఇక ఈ విషయం తెలిసిన రౌడీ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read More...

రెండేళ్లుగా పిల్లలను కనేందుకు ట్రై చేస్తున్నా.. ఇప్పుడు సక్సెస్ అయింది.. పెళ్లికాని హీరోయిన్ మెహ్రీన్ పోస్ట్ వ...

Next Story
null