- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాతబస్తీలో పరిస్థితి అదుపులో ఉంది: తెలంగాణ DGP
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌పై తెలంగాణ డీజీపీ రవి గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పోలింగ్ ప్రశాంగంగా జరిగిందని అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌పై తెలంగాణ డీజీపీ రవి గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పోలింగ్ ప్రశాంగంగా జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు అని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీ పరిస్థితి కూడా అదుపులోనే ఉందని తెలిపారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసులు నమోదు అయ్యాయని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రాష్ట్రవ్యాప్త పోలీసులను డీజీపీ అభినందించారు. ఇంకా మరికొన్ని చోట్ల పోలింగ్ జరుగుతోందని అన్నారు. సదరు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతుకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసుల సహకారం పూర్తిగా అందిందని వికాస్ రాజ్ తెలిపారు. 2019తో పోల్చితే పోలింగ్ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.






