- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20ల్లో సునీల్ నరైన్ సరికొత్త రికార్డు
by Gantepaka Srikanth |
టీ20ల్లో వెస్టిండీస్ ప్లేయర్ సునీల్ సరైన్(Sunil Narine) సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20ల్లో వెస్టిండీస్ ప్లేయర్ సునీల్ సరైన్(Sunil Narine) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్లో ఒక జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్(IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్టు తరపున ఆడుతున్న నరైన్.. 209 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు సమిత్ పటేల్(208) పేరుమీదున్న రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాత క్రిస్ వుడ్(199), లసిత్ మలింగ(195), డేవిడ్ ఫైన్(193) ఉన్నారు.
ఇదిలా ఉండగా.. బౌలింగ్‌తో పాటు నరైన్ బ్యాటింగ్‌లోనూ రాణిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటివరకు 188 మ్యాచులు ఆడిన నరైన్.. 1780 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా కేకేఆర్ తరపున ఆడుతూ రాణిస్తున్నారు.
Next Story






