- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) ఇవాళ చాలా కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. ముంబై ఇండియన్స్ (

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) ఇవాళ చాలా కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) మధ్య మరి కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో... ప్రారంభం కానుండగా... జైపూర్ వేదిక కానుంది. అయితే ఇందులో మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ తీసుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది. ఈ స్టేడియంలో మొదట బౌలింగ్ చేసిన జట్టు గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్.
ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ జట్లకు చాలా కీలకం. ఇందులో ముంబై ఇండియన్స్ గెలిస్తే 18 పాయింట్లతో రెండవ స్థానంలో లేదా మొదటి స్థానానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్ రన్ రేట్ కంటే ఎక్కువగా ఉంటే.. కచ్చితంగా ముంబై ఇండియన్స్ మొదటి స్థానానికి వెళ్లే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పంజాబ్ కింగ్స్... మాత్రం ఇందులో గెలిస్తే 19 పాయింట్లతో నేరుగా మొదటి స్థానానికి వెళుతుంది. అప్పుడు గుజరాత్ టైటాన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో చూడాలి.






