గిల్‌కు భారీ ఫైన్.. అతను చేసిన తప్పేంటో తెలుసా?

by Harish |

ఐపీఎల్-18లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ జోరు మీద ఉన్నది.

గిల్‌కు భారీ ఫైన్.. అతను చేసిన తప్పేంటో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ జోరు మీద ఉన్నది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించడం ద్వారా టోర్నీలో 5వ గెలుపును ఖాతాలో వేసుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో ఆ జట్టు గుజరాత్ అగ్రస్థానంలోకి వెళ్లింది. ఢిల్లీపై విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆ జట్టుకు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. కెప్టెన్ గిల్‌కు జరిమానా విధించారు. ఢిల్లీతో మ్యాచ్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించినట్టు ఐపీఎల్ తెలిపింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో గుజరాత్ నిర్ణీత సమయంలోకా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేదు. దీంతో గిల్‌కు రూ.12 లక్షలు ఫైన్ పడింది. ఈ సీజన్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించడం ఇదే తొలిసారి. ఈ సీజన్లలో పాండ్యా(ముంబై), రియాన్ పరాగ్(రాజస్థాన్), పంత్(లక్నో), రజత్ పటిదార్(బెంగళూరు), శాంసన్(రాజస్థాన్), అక్షర్ పటేల్(ఢిల్లీ) జరిమానా ఎదుర్కొన్న కెప్టెన్లలో ఉన్నారు.


Next Story