- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: హైదరాబాద్ జట్టు పరిస్థితేంటి?.. ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉందా?
ఐపీఎల్(IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు పేలవ ప్రదర్శన కనబర్చుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు పేలవ ప్రదర్శన కనబర్చుతోంది. గత సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జట్టు.. ఈసారి దానికి భిన్నంగా పాయింట్ల పట్టికలో చివరలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడగా.. ఐదింట్లో ఓటమి చవిచూసింది. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌తో పాటు మొన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇంకా ఏడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ ఏడు మ్యాచుల్లో కనీసం ఆరు మ్యాచులలో తప్పకుండా గెలవాల్సి ఉంది. ఏండింట్లో రెండు మ్యాచులు ఓడినా ఇంటిబాట పట్టాల్సిందే అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. దాదాపు అన్ని జట్లు ఏడు మ్యాచులు ఆడేసాయి.
ఇందులో గుజరాత్ జట్టు ఏడు మ్యాచుల్లో ఐదు గెలిచి, రెండింట్లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ సైతం ఐదింట్లో గెలిచి, రెండింట్లో ఓడింది. ఇక లక్నో జట్టు ఎనిమిది మ్యాచులు ఆడగా.. ఐదింట్లో గెలిచి, మూడింట్లో ఓడింది. బెంగళూరు జట్టు ఏడు మ్యాచులాడి నాలుగు గెలిచింది, మూడు ఓడింది. కోల్‌కతా, ముంబై జట్లు మూడు మ్యాచులు గెలిచి, నాలుగు మ్యాచుల్లో ఓటమి చవి చూసింది. రాజస్థాన్ జట్టు ఎనిమిది మ్యాచులు ఆడి రెండింట్లో గెలిచి, ఆరింట్లో ఓడింది. చివరగా హైదరాబాద్, చెన్నై జట్లు ఐదింట్లో ఓడి, చెరో రెండింట్లో విజయం సాధించాయి.






