ఐపీఎల్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. రీషెడ్యూల్ ప్రకటన

by Gantepaka Srikanth |

ఐపీఎల్(IPL 2025) ఫ్యాన్స్‌కు బీసీసీఐ(BCCI) భారీ శుభవార్త చెప్పింది.

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. రీషెడ్యూల్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్(IPL 2025) ఫ్యాన్స్‌కు బీసీసీఐ(BCCI) భారీ శుభవార్త చెప్పింది. భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతల వల్ల టోర్నమెంట్ అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత మళ్లీ పున:ప్రారంభం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగడంతో ఐపీఎల్‌ పున: ప్రారంభంపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. మే 17వ తేదీ నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఆరు స్టేడియాల్లో మిగిలిన 17 మ్యాచులు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జూన్ 3వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని వెల్లడించింది.

Next Story