- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పెషల్ వందేభారత్ రైళ్లలో క్రికెటర్లను తరలించిన బీసీసీఐ
ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఐపీఎల్‌ను వారంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఐపీఎల్‌ను వారంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, గురువారం ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. పాక్‌తో యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం ధర్మశాల ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేసింది. దీంతో ఢిల్లీ, పంజాబ్ ఆటగాళ్లు అక్కడే ఉండిపోయారు.
దీంతో వారిని అక్కడి నుంచి తరలించడానికి బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ధర్మశాల టూ న్యూఢిల్లీకి స్పెషల్ వందే భారత్ ట్రైన్‌ను ఏర్పాటు చేసింది. ప్లేయర్లతోపాటు కామెంటేటర్లు, సపోర్టింగ్ స్టాఫ్, కెమెరామెన్, ఇతరులు ట్రైన్లో ప్రయాణం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బీసీసీఐకి, ఇండియన్ రైల్వేస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
Thank you, @RailMinIndia, for arranging a special Vande Bharat train on such short notice to ferry the players, support staff, commentators, production crew members, and operations staff to New Delhi.
— IndianPremierLeague (@IPL) May 9, 2025
We deeply appreciate your swift response. 🙌🏽@AshwiniVaishnaw | @JayShah |… pic.twitter.com/tUwzc5nGWD
మరోవైపు, ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో క్రికెటర్లను తమ ఇండ్లకు వెళ్లిపోవాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయా ప్రాంజీలు తమ క్రికెటర్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాయి. చెన్నయ్ సూపర్ కింగ్స్ ప్లేయర్లు, గుజరాత్‌కు చెందిన రవీంద్ర జడేజా, ఉర్విల్ పటేల్ తమ సొంత రాష్ట్రానికి పయనమయ్యారు. వారిద్దరి కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






