రేపు ఉప్పల్ స్టేడియంలో SRH vs RR మ్యాచ్

by Disha Web Desk 12 |
రేపు ఉప్పల్ స్టేడియంలో SRH vs RR మ్యాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా సర్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ తమ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత ఫెసర్ భువనేశ్వర్ సారద్యం వహించనున్నాడు. అలాగే యువ ఫెసర్ ఉమ్రాన్ మాలిక్, ఆల్ రౌండర్ సుందర్, బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడే హ్యారీ బ్రోక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్‌తో పటిష్ఠమైన టీమ్ రేడిగా ఉంది.

అలాగే హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌లో SRH జట్టుతో తలపడేందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా సిద్ధమైంది. యువ ప్లేయర్ సంజు శాంసన్ సారధ్యంలో బెస్ట్ బ్యాటింగ్, బౌలింగ్ టీమ్‌తో రానుంది. ఈ క్రమంలో జరిగే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి గట్టీ ఆదరణ ఉందనే చెప్పుకోవాలి. కాగా ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో జరిగే నాలుగో మ్యాచ్ ఆదివారం కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

SRH ప్లేయింగ్ XI అంచనా జట్టు:- అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్ (WK), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అకేల్ హుసేన్, ఉమ్రాన్ మాలిక్, T నటరాజన్.

RR ప్లేయింగ్ XI అంచనా జట్టు:- జోస్ బట్లర్ (WK), యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (సి), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్‌మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్.

Next Story

Most Viewed