IPL 2023: నేడు కోల్‌కతాతో పంజాబ్ కింగ్స్ ఢీ..

by Disha Web Desk 13 |
IPL 2023: నేడు కోల్‌కతాతో పంజాబ్ కింగ్స్ ఢీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టబోతున్నది. పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌లో 5 గెలిచి.. 10 పాయింట్స్‌తో 7వ స్థానంలో నిలిచింది. గత చివరి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు పది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. రెండు జట్లకు లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మరోవైపు కేకేఆర్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా 4 గెలిచి.. 8వ స్థానంలో కొనసాగుతున్నది. దీంతో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (అంచనా):

రహ్మానుల్లా గుర్బాజ్ (wk), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా (c), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి

పంజాబ్ కింగ్స్ (అంచనా):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (సి), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Next Story