రేపటి మ్యాచ్.. రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్

by Disha Web Desk 12 |
రేపటి మ్యాచ్.. రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 16వ సీజన్‌లో 8వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. రెండు జట్లు గువాహటిలో బర్సపరా క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7.30 గంటలకు తలపడనున్నాయి. కాగా మొదటి మ్యాచ్ లో హైదరాబాద్ పై భారీ విజయం అందుకున్న రాజస్థాన్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే ఓపెనర్ బట్లర్ భీకర ఫామ్, బౌలర్లు బోల్డ్, చహాల్, అశ్విన్ ఫామ్ RR కు కలిసిరానుంది.

అలాగే మొదటి మ్యాచ్‌లో వర్షం కారణంగా స్వల్ప తేడాతో విజయం సాధించిన పంజాబ్ జట్టులో కూడా బ్యాటర్లు బౌలర్లు మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. బౌలర్లు సామ్ కరన్, అర్ష్దీప్ సింగ్, కగిసో రబాడ వంటి ఫాస్ట్ బౌలర్లు పంజాబ్ జట్టుకు గట్టి బలం అలాగే ఆల్ రౌండర్ కోటాలో సికిందర్ రజా, సామ్ కరన్ పటిష్టంగా ఉన్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోటీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాగా ఈ మ్యా్చ్‌ను జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చు.

పంజాబ్ ప్లేయింగ్ XI అంచనా జట్టు

శిఖర్ ధావన్(సి), ప్రబ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ, సికందర్ రజా, షారుక్ ఖాన్, సామ్ కుర్రాన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, కగిసో రబాడ, రాహుల్ చాహర్..

రాజస్థాన్ ప్లేయింగ్ XI అంచనా జట్టు

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c/wk), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, KM ఆసిఫ్..



Next Story

Most Viewed