T20 Womens World Cup : ఆస్త్రేలియా VS సౌతాఫ్రికా మధ్య తొలి సెమీఫైనల్స్

by saikumar |
T20 Womens World Cup : ఆస్త్రేలియా VS సౌతాఫ్రికా మధ్య తొలి సెమీఫైనల్స్
X

దిశ, స్పోర్ట్స్ : టీ 20 మహిళా ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నేడు (గురువారం) ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌కు చేరగా.. గ్రూప్-బీ నుంచి దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ చేరింది. దీంతో ఈ రెండు జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి.

ఈ మ్యాచులో గెలుపొందిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లనుంది. కాగా, ఈ రెండు జట్లలో ఆస్ట్రేలియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 20వ తేదీన టీ20 మహిళా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-ఏ నుంచి ఫైనల్‌కు చేరిన జట్టు, గ్రూప్-బీ నుంచి ఫైనల్ చేరిన జట్టు తుదిపోరులో తలపడనున్నాయి.

Advertisement

Next Story