ఘరో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Gantepaka Srikanth |
ఘరో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దామరచర్ల మండలం బోత్తులపాలెం దగ్గర ఆగివున్న బొలేరో వాహనాన్ని డీసీఎం వాహనం అతివేగంగా దూసుకొచ్చి బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలేరో వాహనంలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు దేవరకొండకు చెందిన యాది, రిజ్వాన్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని దగ్గర్లోని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. టాటా నెట్‌వర్క్‌కు చెందిన నలుగురు కార్మికులు కేబుల్ పనులు చేస్తుండగా ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story