suicide : మేడ్చల్ ఎంపీడీవో ఆవరణలో వ్యక్తి ఆత్మహత్య

by Taduka Kalyani |

ఓ వ్యక్తి మేడ్చల్ ఎంపీడీవో ఆవరణలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

suicide : మేడ్చల్ ఎంపీడీవో ఆవరణలో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, మేడ్చల్ టౌన్: ఓ వ్యక్తి మేడ్చల్ ఎంపీడీవో ఆవరణలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి (52) మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ లో తన భార్య మంజుల కొడుకు దినేష్ తో నివాసం ఉంటాడు. సురేందర్ రెడ్డి స్థానికంగా రిలయన్స్ లో పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. శుక్రవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో ఇనుప మెట్ల కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకొని మేడ్చల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story