HYD: సోషల్ మీడియాలో డ్రగ్స్ విక్రయం.. ముఠా అరెస్ట్

by Disha Web Desk 2 |
HYD: సోషల్ మీడియాలో డ్రగ్స్ విక్రయం.. ముఠా అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో కొత్త కోణం మరోసారి కలకలం రేపింది. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎస్పీ గుమ్మ చక్రవర్తి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. సురారంలో పోలీసులతో పాటు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 60 గ్రాముల క్రిస్టల్ మెథాం ఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాం ఫెటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ తయారు చేస్తున్న వారిలో కె.శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని చెప్పారు.

ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గాజుల రామారంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ గతంలో 2013లో ఓ పరిశ్రమలో డ్రగ్స్ తయారు చేయగా అప్పట్లో అరెస్ట్ అయి జైలుకు సైతం వెళ్లినట్లు తెలిపారు. జైలు నుంచి వచ్చాక నరసింహ రాజు, మణికంఠతో కలిసి డ్రగ్స్ తయారు చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. ఈ ముగ్గులు కలిసి తయారు చేసిన డ్రగ్స్ ను వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియా ద్వారా విక్రయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వారిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదన చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు సోషల్ మీడియా విస్తృతంగా వినియోగిస్తున్న తరుణంలో మాదకద్రవ్యాలను సోషల్ మీడియా వేదికగా విక్రయాలు జరుపుతున్న ముఠాలు పెరిగిపోవడం ఆందోళన నగర వాసులను ఆందోళన కలిగిస్తోంది.

Next Story