విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి....

by Taduka Kalyani |

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామ శివారులో రాధాస్వామి ఆశ్రమం దగ్గర విద్యుత్ షాక్ తగిలి అందులో సేవా కార్మికుడిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు.

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి....
X

దిశ, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామ శివారులో రాధాస్వామి ఆశ్రమం దగ్గర విద్యుత్ షాక్ తగిలి అందులో సేవా కార్మికుడిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. పైపాడు గ్రామానికి చెందిన కురువ వెంకటేశ్వర్లు (50) ఆశ్రమంలో సేవ చేస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం ఆశ్రమంలో గడ్డి తొలగిస్తుండగా... ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో కురువ వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story