- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుల్కల్ మండలంలో యువకుడి దారుణ హత్య
పుల్కల్ మండలం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఆయుధంతో తలపై కొట్టి ఓ యువకుడిని హత మార్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

దిశ, చౌటకూర్: పుల్కల్ మండలం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఆయుధంతో తలపై కొట్టి ఓ యువకుడిని హత మార్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం సాయంత్రం ముది మాణిక్యంకు చెందిన అనిల్, దుర్గాప్రసాద్, పత్తులు హనుమాన్ దాస్‌ను మద్యం సేవించేందుకు పుల్కల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారి మధ్య ఏదో తెలియని గొడవ జరిగింది. దీంతో మద్యం మత్తులో ఉన్న వారు హనుమాన్ దాస్ తలపై గుర్తుతెలియని ఆయుధంతో దాడి చేశారు. హనుమంత్ తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే అపస్మారకస్థితిలోకి వెళ్లగా, వారు అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం ఉదయం అటు వైపు వెళ్లిన వారు గమనించి పుల్కల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై క్రాంతి కుమార్ హనుమాన్‌దాస్ మృతి చెందడంతో పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇందుకు బాధ్యులైన దుర్గాప్రసాద్, అనిల్, పత్తు లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.






