BREAKING: ఫేక్ ప్రొఫైల్స్‌తో మోసం చేస్తున్న సైబర్ నేరగాడు అరెస్ట్..

by Disha Web Desk 1 |
BREAKING: ఫేక్ ప్రొఫైల్స్‌తో మోసం చేస్తున్న సైబర్ నేరగాడు అరెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రముఖుల ఫొటోలను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి సామాన్యులను మోసం చేస్తున్న సైబర్ నేరగాడిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లతో రాజస్థాన్ ప్రాంతానికి చెందన నిందితుడు జఫార్ ఖాన్ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించాడు. అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి తనకు డబ్బు పంపాలని పలువురికి మెజేస్‌లు కూడా పంపాడు. గతంలో ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ పేరుతోనూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిందితుడు జఫార్ ఖాన్ నకలీ ఖాతాలను తెరిచాడు. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు నిందితుడు జఫార్‌ ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.


Next Story

Most Viewed