మూడుముక్కలాట నిర్వహిస్తున్న లేడీడాన్ అరెస్ట్

by Disha Web Desk 15 |
మూడుముక్కలాట నిర్వహిస్తున్న లేడీడాన్ అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి : లేడీ డాన్ అక్రమంగా నిర్వహిస్తున్న గేమింగ్ అడ్డాపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడిచేసి 9 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కమ్మంపాటి మాధవిలత(50) అనే మహిళ గత కొంత కాలంగా అక్రమంగా గేమింగ్ (మూడు ముక్కలాట) నిర్వహిస్తుందన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ మాదాపూర్ టీమ్, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని ఖాజాగూడలో ఫ్లాట్ నెం. 304, ఏసీ అట్లాంటిక్స్ అపార్ట్‌మెంట్ పై దాడి చేశారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల నుండి ఫంటర్స్ ను పిలిపించి మాధవీలత పెద్దఎత్తున గేమింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రతి ఆటకు వెయ్యి రూపాయలు ఆర్గనైజర్ ఫీజుగా వసూలు చేస్తూ రోజులో సుమారు వంద ఆటలకు పైగా నిర్వహిస్తుందని తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఆమె వద్ద నుండి రూ. 62,620 నగదు, 11మొబైల్ ఫోన్లు, 5 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కమ్మంపాటి మాధవిలతతో పాటు నాంపల్లికి చెందిన జి. శ్రీనివాస్(58), బైరాంల్‌గూడకు చెందిన కె.రాజేందర్ రెడ్డి(50), మాదాపూర్ కు చెందున బి.లక్ష్మీ నారాయణ(55), అఫ్జల్‌ గంజ్ కు చెందిన కె. రాములు (71), భరత్ నగర్ నివాసి కె. బాల్‌రాజ్ (55), గాజులరామారంనకు చెందిన ఎం. చలపతి రావు(50), నల్లగొండకు చెందిన జి. చంద్రశేఖర్ రెడ్డి(48), గాజులరామారంనకు చెందిన పి. నాగరాజు(60)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story