మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

by Disha Web Desk 23 |
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
X

దిశ, జగిత్యాల రూరల్ : హోలీ పండుగ రోజున విషాదం నింపిన మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని తిప్పన్నపేట గ్రామానికి చెందిన బోగు ప్రకాష్ అనే యువకుడు హోలీ సందర్భంగా చెలరేగిన గొడవ కారణంగా పక్కింటి మహిళపై దాడి చేయడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుడు ప్రకాష్ ను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ , ఎస్సై సధాకర్ అరెస్ట్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించారు.


Next Story

Most Viewed